సోనూసూద్‌కు హారతి పట్టిన తమిళులు
వలస కార్మికులకు అండగా నిలిచి.. నేనున్నానంటూ భరోసానందిస్తున్న నటుడు సోనూసూద్. బస్సులు, రైళ్లు, అవసరమైతే విమానాల్లోనూ వారిని తమ స్వస్థలాలకు పంపించేందుకు సోనూ ఎంతగానో కృషిచేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో తమ బాధను అర్థం చేసుకుని, ఇంటికి చేరవేస్తున్న సోనూసూద్‌ను.. వారందరూ దేవుడిగా కొలుస్తున్న విషయం తెలిసిందే. కాగా సోనూ ఇప్పటికీ తన సాయాన్ని కొనసాగిస్తున్నారు. ముంబైలో చిక్కుకుపోయిన తమిళనాడుకు చెందిన 200 మంది ఇడ్లీ వెండర్స్‌ను సోనూ వారి స్వస్థలాలకు పంపించారు. సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియని […]
వలస కార్మికులకు అండగా నిలిచి.. నేనున్నానంటూ భరోసానందిస్తున్న నటుడు సోనూసూద్. బస్సులు, రైళ్లు, అవసరమైతే విమానాల్లోనూ వారిని తమ స్వస్థలాలకు పంపించేందుకు సోనూ ఎంతగానో కృషిచేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో తమ బాధను అర్థం చేసుకుని, ఇంటికి చేరవేస్తున్న సోనూసూద్‌ను.. వారందరూ దేవుడిగా కొలుస్తున్న విషయం తెలిసిందే. కాగా సోనూ ఇప్పటికీ తన సాయాన్ని కొనసాగిస్తున్నారు. ముంబైలో చిక్కుకుపోయిన తమిళనాడుకు చెందిన 200 మంది ఇడ్లీ వెండర్స్‌ను సోనూ వారి స్వస్థలాలకు పంపించారు. సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న కొందరు తమిళులు.. ఇటీవలే సోనూను ఆశ్రయించారు. దీంతో ఆయన వారిని విమానంలో పంపించాలనుకున్నప్పటికీ అనుమతి లేకపోవడంతో ప్రత్యేక బస్సులో తరలించారు. ఈ క్రమంలోనే ముంబై నుంచి తమిళనాడుకు పంపిస్తున్న ఆ బస్సుకు సోనూసూద్ కొబ్బరికాయ కొట్టి సాగనంపారు. దీంతో ఆ తమిళులందరూ సోనూసూద్‌కు హారతి పట్టి కృతజ్ఞతలు తెలిపారు.