టీకా వేసుకోవడం స్వచ్ఛందమే: కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకోవడం స్వచ్ఛందమేనని, తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో మరోసారి స్పష్టం చేసింది. టీకా వేసుకున్నందున ఎదురయ్యే సైడ్ ఎఫెక్టులు, దుష్ప్రభావాలు, మెడికల్ కాంప్లికేషన్‌లకు ఎటువంటి ఇన్సూరెన్స్ కల్పించడం లేదని తెలిపింది. టీకా పంపిణీ ద్వారా లబ్దిదారులకు ఏమైనా దుష్ప్రభావాలు కలిగితే కేంద్రం ఇన్సూరెన్స్ కల్పిస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే రాజ్యసభకు సమాధానమిచ్చారు. కానీ, టీకా దుష్ప్రభావాలకు వెంటనే చికిత్స అందించడానికి […]
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకోవడం స్వచ్ఛందమేనని, తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో మరోసారి స్పష్టం చేసింది. టీకా వేసుకున్నందున ఎదురయ్యే సైడ్ ఎఫెక్టులు, దుష్ప్రభావాలు, మెడికల్ కాంప్లికేషన్‌లకు ఎటువంటి ఇన్సూరెన్స్ కల్పించడం లేదని తెలిపింది. టీకా పంపిణీ ద్వారా లబ్దిదారులకు ఏమైనా దుష్ప్రభావాలు కలిగితే కేంద్రం ఇన్సూరెన్స్ కల్పిస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే రాజ్యసభకు సమాధానమిచ్చారు. కానీ, టీకా దుష్ప్రభావాలకు వెంటనే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రతి టీకా కేంద్రంలో అనఫిలాక్సిస్ కిట్లు అందుబాటులో ఉంచామని, టీకా వేసుకున్నాకా 30 నిమిషాలపాటు లబ్దిదారులను పరిశీలనలో ఉంచుతున్నామని తెలిపారు. టీకా దుష్ప్రభావాలకు గురైన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
సైడ్ ఎఫెక్ట్‌లు అత్యల్పం
భారత్‌లో వేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలతో దుష్ప్రభావాలు అత్యల్పంగా కనిపించాయని కేంద్రం తెలిపింది. టీకా వేసుకున్న కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట లాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించాయని వివరించింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొవాగ్జిన్ టీకా వేసుకున్నవారందరిలో కేవలం 81 మందిలో మాత్రమే దుష్ప్రభావాలు వెలుగుచూశాయని, అది 0.096 శాతమని పేర్కొంది. కొవిషీల్డ్ వేసుకున్నవారిలో 8402 మందికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్‌లు కలిగాయని, అంటే మొత్తం కొవిషీల్డ్ లబ్దిదారుల్లో కేవలం 0.192 శాతం మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని వివరించింది.