జగన్ తలుచుకుంటే చైర్మన్ అయ్యేవాడిని కాదు : జేసీ
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సీఎం వైఎస్ జగన్ పై పొగొడ్తల వర్షం కురిపించారు. జగన్ తన తండ్రి వైఎస్‌లా నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. జగన్ తలుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చైర్మన్‌ను అయ్యేవాడిని కాదన్నారు. త్వరలోనే సీఎం జగన్, మంత్రి బొత్సలను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధి కోసం వారి సాయం కోరతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. జగన్ ఈ రాష్ట్రానికి […]
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సీఎం వైఎస్ జగన్ పై పొగొడ్తల వర్షం కురిపించారు. జగన్ తన తండ్రి వైఎస్‌లా నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. జగన్ తలుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చైర్మన్‌ను అయ్యేవాడిని కాదన్నారు. త్వరలోనే సీఎం జగన్, మంత్రి బొత్సలను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధి కోసం వారి సాయం కోరతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయనను కలవడంలో తప్పులేదని చెప్పుకొచ్చారు. తాను ఏంచేసినా తాడిపత్రి అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ కూడా తనను ప్రశంసించారని జేసీ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ది కోసం ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలకు లేఖలు సైతం రాయనున్నట్లు తెలిపారు.