కరోనా ఎఫెక్ట్.. టీ20 వరల్డ్‌ కప్ వాయిదా

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇప్పటికే జరగాల్సిన అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లు వాయిదా పడ్డాయి. భారత్‌లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ సహా వాయిదా పడుతూ వస్తుండటంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గరువుతున్నారు. తాజాగా క్రీడాభిమానులకు ఐసీసీ మరో చేదు వార్త వినిపించింది. టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన […]

Update: 2020-07-20 09:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇప్పటికే జరగాల్సిన అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లు వాయిదా పడ్డాయి. భారత్‌లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ సహా వాయిదా పడుతూ వస్తుండటంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గరువుతున్నారు. తాజాగా క్రీడాభిమానులకు ఐసీసీ మరో చేదు వార్త వినిపించింది. టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అదే సమయంలో 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవంబర్ 14న జరగనుంది. అనంతరం 2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న నిర్వహించనున్నారు. అంతేగాకుండా 2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ అధికారికంగా తెలిపింది.

Tags:    

Similar News