త్రిల్లింగ్ మ్యాచ్.. కర్ణాటకపై తమిళనాడు ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు తీసి 151 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేసింది. కర్ణాటక బ్యాటర్లల్లో అభినవ్ మనోహర్(46), ప్రవీణ్ దూబే(33) మినహా మిగితా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు తీసి 151 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేసింది. కర్ణాటక బ్యాటర్లల్లో అభినవ్ మనోహర్(46), ప్రవీణ్ దూబే(33) మినహా మిగితా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. తమిళనాడు బౌలర్లల్లో సాయి కిషోర్ 3 తీసాడు.
దీంతో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టు ఓపెనర్ జగదీశన్ (41) పరుగులతో రాణించగా, చివరి బంతికి 5 పరుగులు చేయాల్సివుండగా షారుక్ ఖాన్ సిక్స్ కొట్టి(33)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తమిళనాడు జట్టు వరుసగా రెండోసారి సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచింది.