దిశకో న్యాయం.. గిరిజన యువతికో న్యాయమా?
దిశ ప్రతినిధి, ఖమ్మం: మిర్యాలగూడకు చెందిన గిరిజన యువతిపై గత పదేండ్లుగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2010 నుంచి ఓ గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడిన 139 మందిని వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: మిర్యాలగూడకు చెందిన గిరిజన యువతిపై గత పదేండ్లుగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
2010 నుంచి ఓ గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడిన 139 మందిని వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని కోరారు. దిశకో న్యాయం గిరిజన మహిళకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. 139 మందిపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మహిళా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.