నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. ప్రధాని రాజీనామా
న్యూఢిల్లీ: స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో గతవారం ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన ప్రభుత్వం గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి ఆయనకు వారం రోజుల గడువును ఇచ్చింది. కాగా సోమవారంతో గడువు ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని పదవికి తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. ఆ పదవీ […]
న్యూఢిల్లీ: స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో గతవారం ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన ప్రభుత్వం గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి ఆయనకు వారం రోజుల గడువును ఇచ్చింది. కాగా సోమవారంతో గడువు ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని పదవికి తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. ఆ పదవీ బాధ్యతల నుంచి ఉపశమనం కలిగించాలనీ స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం స్వీడన్‌కు మంచిది కాదని ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు కూడా ఏడాది దూరంలో ఉన్నాయనీ ఆయన గుర్తు చేశారు.