స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో గల స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంత మైన మహారాష్ట్రలో గత మూడు రోజులుగా కురిసిన వర్షలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యము 1183 అడుగులకు గాను 1183 అడుగుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా 945 అడుగుల వరద నీరును దిగువ ప్రాంతానికి వదిలిపెట్టారు. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి […]

Update: 2020-08-16 04:05 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో గల స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంత మైన మహారాష్ట్రలో గత మూడు రోజులుగా కురిసిన వర్షలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యము 1183 అడుగులకు గాను 1183 అడుగుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా 945 అడుగుల వరద నీరును దిగువ ప్రాంతానికి వదిలిపెట్టారు. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ముషారఫ్

స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం కలెక్టర్ షారుకి ముషారఫ్ అలీ సందర్శించి ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వర్ణ వాగు వైపు వెళ్లవద్దని తెలిపారు. ఈయన వెంట ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News