నిరుపేద తల్లిదండ్రులకు నిత్యావసరాల పంపిణీ
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద తల్లిదండ్రులకు స్వేరోస్ బాసటగా నిలిచింది. రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు, వలస కార్మికులు, దినసరి కూలీలకు నిత్యావసరాలు అందజేశారు. ముఖ్యంగా పట్టణంలోని మారుతీనగర్ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ. 50 వేల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు […]
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద తల్లిదండ్రులకు స్వేరోస్ బాసటగా నిలిచింది. రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు, వలస కార్మికులు, దినసరి కూలీలకు నిత్యావసరాలు అందజేశారు. ముఖ్యంగా పట్టణంలోని మారుతీనగర్ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ. 50 వేల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు స్వేరోస్ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ నాయకులు ప్రభు, గడప రాజు, రామంచ రాజేందర్, రమేష్, కిరణ్, స్వేరోస్ నాయకులు మేకల రవీందర్, దొద్దే కుమార స్వామి, ప్రవీణ్, సీఆర్వో సురేష్, పీఈటీ సుమన్, అసిస్టెంట్ కేర్ టేకర్ భిక్షపతిలతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
tags: gurukul school, students parents, necessities supply, rs praveen kumar
slug :