చార్మినార్ వద్ద స్వచ్చ భారత్ కార్యక్రమం.. వామ్మో అంత చెత్తా..
దిశ, చార్మినార్ : చార్మినార్‌లో నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సోమవారం స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ యువకేంద్ర రంగారెడ్డి, ఎన్ఎస్ఎస్ సహకారంతో జరిగిన కార్యక్రమానికి బెంగుళూరు, సౌత్ జోన్ నెహ్రూ యువకేంద్ర సంఘం రీజనల్ డైరెక్టర్ సత్యప్రకాష్ పట్నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ యువకేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ ఖుష్బు గుప్త క్లీన్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసరాలను ఎన్ఎస్ఎస్ […]
దిశ, చార్మినార్ : చార్మినార్‌లో నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సోమవారం స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ యువకేంద్ర రంగారెడ్డి, ఎన్ఎస్ఎస్ సహకారంతో జరిగిన కార్యక్రమానికి బెంగుళూరు, సౌత్ జోన్ నెహ్రూ యువకేంద్ర సంఘం రీజనల్ డైరెక్టర్ సత్యప్రకాష్ పట్నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ యువకేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ ఖుష్బు గుప్త క్లీన్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసరాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి శుభ్రపరిచారు. చార్మినార్ పరిసరాలలో పేరుకు పోయిన 1980 కిలోల ప్లాస్టిక్‌ను తొలగించారు.
ఈ సందర్భంగా సత్యప్రకాష్ పట్నాయక్ మాట్లాడుతూ.. అక్టోబర్ 31 వరకూ స్వచ్చభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోహైల్ ఖాద్రి, నెహ్రూ యువకేంద్ర సంఘం రాష్ట్ర డైరెక్టర్ అంశుమాన్ ప్రసాద్ దాస్, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, సౌత్ జోన్ డిప్యూటి కమిషనర్ ఎస్ఎన్ సూర్యకుమార్, జీహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిఇఇ ఎ.శ్రీనివాస్, నెహ్రూ యువకేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాజేష్, ప్రతినిధులు ఐసయ్య, వి.చంద్రశేఖర్, ఆర్.వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.