8 ట్రంకు పెట్టెలు : ట్రెజరీ ఉద్యోగిపై వేటు
అనంతపురంలో 8 ట్రంకుపెట్టెల్లో భారీగా బంగారం, వెండి, నగదు బయటపడ్డ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ పెట్టెల్లో కోట్ల రూపాయల విలువైన అవినీతి సొమ్మును దాచిపెట్టినట్లు ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌పై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఖజానా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రివాల్వర్ తో చంపుతానని బెదిరించినట్టు మనోజ్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రివాల్వర్ కోసం బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రివాల్వర్ కోసం జరిపిన సోదాల్లో […]
అనంతపురంలో 8 ట్రంకుపెట్టెల్లో భారీగా బంగారం, వెండి, నగదు బయటపడ్డ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ పెట్టెల్లో కోట్ల రూపాయల విలువైన అవినీతి సొమ్మును దాచిపెట్టినట్లు ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌పై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఖజానా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రివాల్వర్ తో చంపుతానని బెదిరించినట్టు మనోజ్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రివాల్వర్ కోసం బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రివాల్వర్ కోసం జరిపిన సోదాల్లో పోలీసులు 8 ట్రంకు పెట్టెలను గుర్తించారు.
వీటిలో నిల్వ ఉంచిన బంగారం, వెండితో పాటు, కొన్ని డాక్యుమెంట్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు కేసును ఎసిబికి అప్పగించారు. త్వరలో అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించనుంది.