వికీపీడియా తప్పు చేసింది.. సుశాంత్ సిస్టర్ ఫైర్
దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంకా సింగ్ వికీపీడియాపై ఫైర్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేజీలో మార్పులు చేసి అసత్యప్రచారం చేస్తోందని మండిపడింది. ఏడాది నుంచి సుశాంత్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నా.. ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన ప్రియాంక ఇందుకు సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. జూలై 20 10:52 PM సమయంలో ‘ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు(విచారణ జరుగుతోంది)’ అని ఉండగా.. […]
దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంకా సింగ్ వికీపీడియాపై ఫైర్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేజీలో మార్పులు చేసి అసత్యప్రచారం చేస్తోందని మండిపడింది. ఏడాది నుంచి సుశాంత్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నా.. ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన ప్రియాంక ఇందుకు సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. జూలై 20 10:52 PM సమయంలో ‘ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు(విచారణ జరుగుతోంది)’ అని ఉండగా.. ఆ తర్వాత గంటకు 11:48PM టైమ్‌లో ‘ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు’ అని నిర్దారించడం వెనుక అర్థమేంటని ప్రశ్నించింది.
గంటలోనే రెండుసార్లు పేజీ మార్చిందంటే.. వికీపీడియా కాంప్రమైజ్ అయిందా అని ట్విట్టర్ ద్వారా అడిగింది. తప్పుడు సమాచారానికి, ప్రచారానికి నో చెప్పాలన్న ప్రియాంక.. వికీపీడియా విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పింది.
By twice changing @itsSSR wiki page within a span of few hours @Wikipedia @jimmy_wales have confirmed that the platform is compromised.
It is no longer a source of factual information. It has lost its credibility.
Say No to Misinformation, Say No to Propaganda pic.twitter.com/PziLYr5ISz— Priyanka Singh (@withoutthemind) July 21, 2021