1100 గ్రాముల గంజాయి పట్టివేత
మండల కేంద్రంలోని టేకులపల్లి టీ రోడ్ జంక్షన్ వద్ద 1100 గ్రాముల గంజాయిని పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై గంగారం తెలిపారు.
దిశ, కన్నెపల్లి : మండల కేంద్రంలోని టేకులపల్లి టీ రోడ్ జంక్షన్ వద్ద 1100 గ్రాముల గంజాయిని పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై గం గారం తెలిపారు. గురువారం ఉదయం ఈస్గాం నుండి రేచీనికి గంజాయి రవాణా జరుగుతుందని ముందస్తు సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో మాటు వేసి ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న రాజు, శామీర్ బరాయి అనే ఇద్దరు వ్యక్తుల నుండి సుమారు 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని రిమాండ్ కి పంపించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.