‘మహాశివరాత్రి జాతర సమర్థవంతంగా నిర్వహించాలి’
స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి, కళ్యాణ మహోత్సవ జాతరకు సంబందించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మేళ్లచేర్వు శివాలయంలో జరగనున్న శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ డి. సంజీవ రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 25వరకు జరగునున్న మహాశివరాత్రి […]
స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి, కళ్యాణ మహోత్సవ జాతరకు సంబందించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మేళ్లచేర్వు శివాలయంలో జరగనున్న శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ డి. సంజీవ రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 25వరకు జరగునున్న మహాశివరాత్రి జాతరకు ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, అవసరం మేర నీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మెడికల్ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ముఖ్యంగా నిర్దేశించిన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి నిల్వలు ఉంచాలని తెలిపారు. జాతరలో గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలని అబ్కారి శాఖను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులను నిర్వహించాలనీ, అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా గ్రామపంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టకుని, అన్ని పనులను సత్వరమే పూర్తి చేసి జాతరను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీఈవో విజయలక్ష్మి, ఆర్డీవో కిషోర్ కుమార్, కోదాడ డీఎస్పీ రఘు, డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్, సీపీవో అశోక్ సహా వివిధ శాఖల అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.