ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా 34 శాతంపైగా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని ఆదేశించింది. […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా 34 శాతంపైగా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఎస్టీ, ఎస్సీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఆ తీర్పుకు లోబడి రిజర్వేషన్లు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.