మరాఠా కోటాపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: మరాఠాల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ విషయాన్ని విచారించడానికి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీజేఐ ఎస్ఏ బాబ్డే విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరాఠాలకు కోటా ఇవ్వడంతో మొత్తం రిజర్వేషన్లు 50శాతాన్ని దాటాయని, మహారాష్ట్ర రూపొందించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్రస్తుత ఏడాది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో మరాఠా కోటా అమలు కాదని తెలుస్తున్నది. అయితే, పీజీ కోర్సులోకి […]
న్యూఢిల్లీ: మరాఠాల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ విషయాన్ని విచారించడానికి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీజేఐ ఎస్ఏ బాబ్డే విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరాఠాలకు కోటా ఇవ్వడంతో మొత్తం రిజర్వేషన్లు 50శాతాన్ని దాటాయని, మహారాష్ట్ర రూపొందించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది.
దీంతో ప్రస్తుత ఏడాది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో మరాఠా కోటా అమలు కాదని తెలుస్తున్నది. అయితే, పీజీ కోర్సులోకి ప్రవేశాలపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తా, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
మరాఠాల పోరాటం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వారికి 16శాతం కోటాను ప్రకటించింది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలకు 16 శాతం రిజర్వేషన్లు మరాఠాలకు కేటాయిస్తూ చట్టం చేసింది. ఈ చట్టాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేయగా, న్యాయస్థానం దాని చట్టబద్ధతను సమర్థించింది.
అయితే, రిజర్వేషన్ కేటాయించిన మొత్తం న్యాయంగా లేదని పేర్కొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్‌ల మొత్తాన్ని కుదిస్తూ జులై 1న చట్టం చేసింది. విద్యా రంగాల్లో 12శాతం, ఉద్యోగాల నియామకాల్లో 13శాతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కేటాయిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే.