ఆ ఆలయ నిర్వహణ.. రాజవంశీకులదే

న్యూఢిల్లీ: ట్రావెన్‌కోర్ రాజవంశీకులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజవంశీకులకే ఉంటుందని స్పష్టం చేసింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ ఆలయంపై నియంత్రణను రాజకుటుంబ సభ్యులున్న ట్రస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాజవంశీయులు కోర్టును ఆశ్రయించారు. 2011లో ఈ ఆలయం ఒక్కసారి సంచలనమైంది. పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో నిధులు, నిక్షేపాలున్నాయని చర్చలు జరిగిన నేపథ్యంలో ఇన్వెంటరీకి కోర్టు ఆదేశించింది. ఆరు […]

Update: 2020-07-13 09:22 GMT

న్యూఢిల్లీ: ట్రావెన్‌కోర్ రాజవంశీకులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజవంశీకులకే ఉంటుందని స్పష్టం చేసింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ ఆలయంపై నియంత్రణను రాజకుటుంబ సభ్యులున్న ట్రస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాజవంశీయులు కోర్టును ఆశ్రయించారు. 2011లో ఈ ఆలయం ఒక్కసారి సంచలనమైంది. పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో నిధులు, నిక్షేపాలున్నాయని చర్చలు జరిగిన నేపథ్యంలో ఇన్వెంటరీకి కోర్టు ఆదేశించింది. ఆరు నేలమాలిగళ్లోని ఐదింటిని తెరువగా భారీగా నిధులు బయటపడ్డాయి. ఆరోగది తెరవడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆ గది తెరిస్తే ప్రళయం వస్తుందని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ గది అలాగే తెరవకుండానే ఉండిపోయింది. తాజాగా, ఆ గది తెరవడం రాజకుటుంబీకుల అభీష్టానికే సుప్రీంకోర్టు వదిలేసింది.

Tags:    

Similar News