జగన్ బహిర్గతం చేయడం.. ముమ్మాటికీ ధిక్కారమే

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సుప్రీంకోర్టు లాయర్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు లాయర్‌ అశ్విని లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీజేకు సీఎం జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా ప్రవర్తిస్తున్నాడంటూ […]

Update: 2020-10-26 01:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సుప్రీంకోర్టు లాయర్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు లాయర్‌ అశ్విని లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీజేకు సీఎం జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు.

31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఆమె సీజేకు కూడా లేఖ రాశారు. అంతేగాకుండా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో అశ్విని ఉపాధ్యాయ పిల్‌ దాఖలు చేశారు. లాయర్ అశ్వినకుమార్ సీజేకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

 

Tags:    

Similar News