‘బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్’ పిటిషన్ విచారణకు ఓకే
న్యూఢిల్లీ : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ అల్లర్ల బాధితులు వేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ విచారణ బుధవారం మొదలుకానుంది. విద్వేషపు ప్రసంగాలు చేసి, అల్లర్లకు ప్రేరేపించారని భావిస్తున్న బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, ప్రవేష్ వర్మలు సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పదిమంది బాధితులు దాఖలు చేసిన పిల్ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఇటువంటి పిటిషన్‌ను విచారించిన […]
న్యూఢిల్లీ : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ అల్లర్ల బాధితులు వేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ విచారణ బుధవారం మొదలుకానుంది. విద్వేషపు ప్రసంగాలు చేసి, అల్లర్లకు ప్రేరేపించారని భావిస్తున్న బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, ప్రవేష్ వర్మలు సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పదిమంది బాధితులు దాఖలు చేసిన పిల్ పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఇటువంటి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నాలుగువారాలకు వాయిదా వేసింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన న్యాయమూర్తి ఎస్ మురళీధరన్ బదిలీ కావడం గమనార్హం. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడారు. ‘జరుగుతున్న పరిణామాలను మేం ఆపలేం. జరగబోయే చర్యలను నియంత్రించలేం. కానీ, కోర్టు నుంచి ఇటువంటివి ఆశించినప్పుడు ఒత్తిడికి లోనవుతాం. ఆ ఒత్తిడిని అదిగమించడం కష్టతరమవుతుంది. ఘటనలు జరిగిన తర్వాతే కోర్టు ప్రవేశిస్తుంది. కానీ, ముందస్తుగా నియంత్రణ చర్యలను కోర్టులు తీసుకోలేవు’ అని అన్నారు.
tags : supreme court, delhi riots, fir’s against leaders, hateful speeches