పోలీస్ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులు

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ పోలీస్ శాఖలో నాన్-క్యాడర్ ఎస్సీ, డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరరీ పద్ధతిలో క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు జీఓ ఎంఎస్ 39 జారీ చేశారు. నాన్-కేడర్ ఎస్సీ విభాగంలో 26 పోస్టులు, డీఎస్పీ విభాగంలో 122 పోస్టులను క్రియేట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రమోషన్ల విషయంపై పలు స్థాయిల్లో కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ […]

Update: 2021-03-23 12:34 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ పోలీస్ శాఖలో నాన్-క్యాడర్ ఎస్సీ, డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరరీ పద్ధతిలో క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు జీఓ ఎంఎస్ 39 జారీ చేశారు. నాన్-కేడర్ ఎస్సీ విభాగంలో 26 పోస్టులు, డీఎస్పీ విభాగంలో 122 పోస్టులను క్రియేట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రమోషన్ల విషయంపై పలు స్థాయిల్లో కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ కారణంగా ఆయా పోస్టుల్లో ప్రమోషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు సూపర్ న్యూమరరీ పద్ధతిలో ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించనుంది. రెగ్యులర్ పోస్టుల వరకు మాత్రమే ఈ ప్రమోషన్లు అమల్లో ఉంటాయని జీఓలో స్పష్టం చేశారు.

Tags:    

Similar News