రసవత్తర పోరులో రాజీపడేదెవరు?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఈ రోజు రసవత్తరపోరు జరగనుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచిన పంజాబ్.. పంజా విసురుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు 5 మ్యాచులు ఆడి ఎట్టకేలకు 2 మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై గెలుపుతమేదేనంటోంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏ […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఈ రోజు రసవత్తరపోరు జరగనుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచిన పంజాబ్.. పంజా విసురుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు 5 మ్యాచులు ఆడి ఎట్టకేలకు 2 మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై గెలుపుతమేదేనంటోంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించినా.. సీజన్‌లో ఆ జట్టు దశ మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక పంజాబ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా.. బౌలింగ్‌లో షమీ మినహా ఎవ్వరూ కూడా రాణించలేకపోతున్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్ రాణిస్తున్నప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్లు ఫామ్ లోకి రావాల్సి ఉంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా రాణిస్తే తప్ప పంజాబ్‌కు ఈ సీజన్‌లో అవకాశాలు దొరుకుతాయని కామెంటేటర్లు చెబుతూనే ఉన్నారు. అయితే, హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. పంజాబ్ కు కాస్తా ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి.
ఇక హైదరాబాద్‌లో బ్యాటింగ్ బలంగా ఉన్న.. ఒక ఆటగాడు. కుదురుకుంటే మరో ఆటగాడు చేతులెత్తేస్తున్నాడు. దీంతో స్కోరు బోర్డు అంతంత మాత్రన్నే సాగుతోంది. బౌలింగ్ లో రైజర్స్ రాణిస్తున్న సమయంలో భువనేశ్వర్ జట్టుకు దూరం కావడంతో ఆ ఎఫెక్ట్ భారీగానే పడింది. కీలక ఫేసర్ లేకపోవడంతో బౌలింగ్ లైనప్ బలహీన పడిందనే చెప్పాలి.
ఇక బ్యాట్స్‌మెన్లు భారీ స్కోర్ చేస్తే తప్ప విజయం హైదరాబాద్‌ను వరించదనే చెప్పాలి. పంజాబ్ బ్యాట్స్‌మెన్లు కుదురుకుంటే 200 స్కోర్ ను కూడా అవలీలగా ఛేదిస్తారు.. కాబట్టి హైదరాబాద్ భారీ స్కోర్ తో పాటు బౌలింగ్ లో మరింత పట్టు సాధించాల్సి ఉందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.