President of India: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కొత్త గవర్నర్లను నియమించారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్‌గా విజయ్ కుమార్ సింగ్, బిహార్ గవర్నర్‌గా అరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌లను నియమించారు.