ఆ క్రికెటర్ అదృష్టవంతుడు
దిశ, స్పోర్ట్స్: ఏ క్రికెటర్ అయినా కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచకప్ ఆడాలని కలలు కంటాడు. ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టును విశ్వవిజేతగా నిలుపాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. చాలా మంది ఆటగాళ్లకు ఈ అవకాశం దక్కకపోవచ్చు. కానీ, ఓ క్రికెటర్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ ముద్దాడటం అతని అదృష్టమో లేక అవకాశాలు రాక బెంచ్‌కే పరిమితమవ్వడం దురదృష్టమో కానీ క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఆటగాడిగా నిలిచిపోయాడు. అతను ఎవరో కాదు […]
దిశ, స్పోర్ట్స్: ఏ క్రికెటర్ అయినా కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచకప్ ఆడాలని కలలు కంటాడు. ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టును విశ్వవిజేతగా నిలుపాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. చాలా మంది ఆటగాళ్లకు ఈ అవకాశం దక్కకపోవచ్చు. కానీ, ఓ క్రికెటర్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ ముద్దాడటం అతని అదృష్టమో లేక అవకాశాలు రాక బెంచ్‌కే పరిమితమవ్వడం దురదృష్టమో కానీ క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఆటగాడిగా నిలిచిపోయాడు. అతను ఎవరో కాదు భారత మాజీ క్రికెటర్ సునీల్ వాల్సన్. కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో అతను కూడా సభ్యుడు. 14 మంది సభ్యుల జట్టులో 13 మంది కనీసం 2 మ్యాచ్‌లైనా ఆడగా, వాల్సన్‌కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎడం చేతివాటం మీడియం పేసర్ అయిన వాల్సన్ మైదానంలోకి దిగకపోయినా విన్నింగ్ టీమ్ సభ్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.