పదేళ్లుగా పంటిబిగువున బాధ అనుభవిస్తున్నా : టీవీ నటి
దిశ, సినిమా: ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ సుమోనా చక్రవర్తి తన ఆరోగ్య సమస్యలపై పెదవి విప్పింది. తను 2011 నుంచి ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నానని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం వర్క్అవుట్స్ తర్వాత ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసిన సుమోనా.. తన పరిస్థితిపై నోట్లో పేర్కొంటూ ‘చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రాపర్ వర్క్అవుట్స్..’ అనే క్యాప్షన్ జతచేసింది. ‘బోర్డమ్ కూడా అడ్వాంటేజ్‌గా మారడంతో కొన్నిరోజులు చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. అయితే […]
దిశ, సినిమా: ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ సుమోనా చక్రవర్తి తన ఆరోగ్య సమస్యలపై పెదవి విప్పింది. తను 2011 నుంచి ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నానని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం వర్క్అవుట్స్ తర్వాత ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసిన సుమోనా.. తన పరిస్థితిపై నోట్లో పేర్కొంటూ ‘చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రాపర్ వర్క్అవుట్స్..’ అనే క్యాప్షన్ జతచేసింది. ‘బోర్డమ్ కూడా అడ్వాంటేజ్‌గా మారడంతో కొన్నిరోజులు చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. అయితే నాకు ఉద్యోగం లేకపోయినా, ఇప్పటికీ కుటుంబాన్ని పోషించగలగడం గొప్ప విషయమే. ఇక చాలా ఏళ్ల నుంచి నేను ఎండోమెట్రియాసిస్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న విషయాన్ని ఇప్పటివరకు బయటకు చెప్పుకోలేదు. అయితే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, స్ట్రెస్ ఫీల్ అవకపోవడమే నేను ఆరోగ్యంగా ఉండేందుకు కారణం. కానీ లాక్డౌన్ టైమ్‌ను ఎదుర్కోవడం మాత్రం నాకు మానసికంగా చాలా కష్టమైంది’ అని చెప్పుకొచ్చింది.
కాగా ఈ రోజు వర్కవుట్స్ చేయడంతో హ్యాపీగా ఫీలవుతున్నానని చెప్పిన సుమోనా.. ఈ పోస్టు చదివిన వారు మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే తన భావాలను పంచుకుంటున్నానని తెలిపింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఇలాంటి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం చాలా కష్టమే కానీ, కష్టాల్లో ఉన్న కొంతమందిలో అయినా ఈ మాటలు చిరునవ్వును తీసుకొస్తే అదే చాలని అభిప్రాయపడింది. కాగా ఈ పోస్టుపై పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. నువ్వు ధైర్యవంతురాలివే కాదు.. బ్యూటిపుల్ అండ్ స్ట్రాంగ్ అంటూ ప్రశంసిస్తు్న్నారు.