బంధువు చేతిలో మోసం.. మనస్తాపంతో ఆత్మహత్య

దిశ, స్టేషన్ ఘన్ పూర్: పట్టా పాస్ బుక్ పెట్టుకుని అప్పు ఇప్పించమని వెళితే.. ఎకరం 10 గంటల భూమిని కాజేశారని ఆలస్యంగా తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాకి చెందిన బానోతు కృష్ణ. వివరాల్లోకి వెళితే… ఆంధ్ర తండాకు చెందిన బానోతు కృష్ణ తన పట్టాదారు పాస్ బుక్ ద్వారా లోన్ కావాలని దగ్గర బంధువు మాలోతు షెనధ్రిని ఆశ్రయించాడు. కృష్ణ అమాయకత్వాన్ని గ్రహించిన షెనాద్రి ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకెళ్లి […]

Update: 2021-08-21 07:30 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: పట్టా పాస్ బుక్ పెట్టుకుని అప్పు ఇప్పించమని వెళితే.. ఎకరం 10 గంటల భూమిని కాజేశారని ఆలస్యంగా తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాకి చెందిన బానోతు కృష్ణ. వివరాల్లోకి వెళితే… ఆంధ్ర తండాకు చెందిన బానోతు కృష్ణ తన పట్టాదారు పాస్ బుక్ ద్వారా లోన్ కావాలని దగ్గర బంధువు మాలోతు షెనధ్రిని ఆశ్రయించాడు. కృష్ణ అమాయకత్వాన్ని గ్రహించిన షెనాద్రి ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకెళ్లి సర్వెనంబర్ 86/2/అ/2, 90/2/ఆ/2/1 నుండి మరో వ్యక్తికి 1 ఎకరం 10 గు.ల భుమి పట్టా చేయించి రూ.20 వేలు మృతుడు కృష్ణ చేతిలో పెట్టాడు. మిగతా డబ్బులు అకౌంట్ కు జమ చేస్తామని చెప్పి నమ్మించాడు. అప్పు కోసమని వెళితే మోసగించారని ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణ.. మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్ర కి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags:    

Similar News