ప్రభుత్వ వైఖరి.. ఆ జిల్లాలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యయత్నాలు

దిశ, భూపాలపల్లి : జిల్లాలో ప్రభుత్వం వైఖరిపై నిరసన‌తో పాటు ఆత్మహత్యయత్నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగక తిరిగి తిరిగి విగతజీవులుగా మారి, తమకు చెందాల్సిన భూములు ఇతరులకు చెందుతుంది అనే బాధతో నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చివరి ప్రయత్నంగా మందు డబ్బాలు పట్టుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాతముత్తాతల నుండి వచ్చిన వారసత్వ భూములు ఎవరో లాగేసుకుంటూ, తన వారసులకు చెందాల్సిన లక్షలాది రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతుంటే, తట్టుకోలేక […]

Update: 2021-08-17 02:23 GMT

దిశ, భూపాలపల్లి : జిల్లాలో ప్రభుత్వం వైఖరిపై నిరసన‌తో పాటు ఆత్మహత్యయత్నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగక తిరిగి తిరిగి విగతజీవులుగా మారి, తమకు చెందాల్సిన భూములు ఇతరులకు చెందుతుంది అనే బాధతో నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చివరి ప్రయత్నంగా మందు డబ్బాలు పట్టుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాతముత్తాతల నుండి వచ్చిన వారసత్వ భూములు ఎవరో లాగేసుకుంటూ, తన వారసులకు చెందాల్సిన లక్షలాది రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతుంటే, తట్టుకోలేక తనువు చాలించడానికి సిద్ధమవుతున్నారు బాధితులు. సమస్య తీవ్రంగా ఉంటే చావే శరణ్యం అంటూ మందు డబ్బా పట్టుకొని కార్యాలయం ముందు కూర్చున్నారు. ఇది బెదిరింపు కోసమా లేక సమస్య పరిష్కారం కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఈ తంతు అలవాటుగా మారడంతో అధికారులు తల పట్టుకుని కూర్చున్నారు.

భూపాల్ పల్లి జిల్లా లోని మహాదేవపూర్ గ్రామానికి చెందిన పెద్దింటి మధుకర్ అనే వ్యక్తి 2020 జూన్ రెండో తేదిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, 50 సంవత్సరాలుగా తాను సాగుచేసుకుంటున్న భూమిని వేరే వ్యక్తికి పట్టా చేసారని ఆవేదనతో, రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యఅతిథి భానుప్రసాద్ ముందు మందు డబ్బా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. వెంటనే సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అప్పటి జిల్లా కలెక్టర్ కి సూచించినప్పటికీ ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కానే కాలేదు. సదరు బాధితుడు కలెక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కాటారం‌లో సైతం కొట్టే శ్రీనివాస్ అనే వ్యక్తి తన భూమిని ఇతరులకు పట్టా చేసారని రెవెన్యూ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయినప్పటికీ సమస్య అలానే ఉండిపోయింది. మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రాగం సతీష్ కుమార్ తన భూమి వేరే వ్యక్తి పట్ట చేయించుకున్నాడని నెల క్రితం ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. అది ప్రైవేట్ వ్యక్తి కావడంతో వెంటనే సమస్య పరిష్కారం జరిగింది. గత మూడు రోజుల క్రితం మహాముత్తారం మండలంలోని కోణం పేట గ్రామానికి చెందిన పది మంది ఆదివాసీలు తాము సాగుచేసుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కుందని చేసేదేమిలేక తనువుచాలిద్దామని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి సమస్యలు అలానే ఉండిపోయాయి.

15 రోజుల క్రితం చిట్యాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన సుమారు 300 మంది రైతులు తమ భూములు అన్యాయం అయిపోయాయి అని అందులో ఓ రైతు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం జిల్లా కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని కొంతమేరకు సమస్య పరిష్కరించినట్లు తెలిసింది. గురువారం రోజు మాధవరావు పల్లి గ్రామానికి చెందిన 20 మంది భూ నిర్వాసితులు తమకు పరిహారం సింగరేణి సంస్థ ఇవ్వడం లేదని అదే కార్యక్రమానికి పాల్పడ్డారు. అయినప్పటికీ వారి సమస్యలు తీర్చే నాదుడు లేడు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు తీరకపోవడంతో రైతులు భూమి కోసం ప్రాణాలు తీసుకోవలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. అధికారులు ముడుపుల‌కు ఆశపడి, అసలైన రైతులకు అన్యాయం చేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.

ధరణి‌తో తంటాలు

రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ భూముల వివరాలు అందుబాటులో ఉంచడానికి ధరణి వెబ్ సైట్‌ను ప్రారంభించినప్పటికీ, దానితోనే చాలా మంది రైతులు తంటాలు పడవలసి వస్తుంది. ధరణి ప్రక్రియ జరిగే సమయంలో వీఆర్‌ఓ వ్యవస్థ ఉన్న సమయంలో వీఆర్‌ఓలు తమకు అనుకూలంగా ఉన్న వారికి ధరణి‌లో భూముల వివరాలు నమోదు చేయడంతో ప్రస్తుతం సమస్య జటిలమైనది. ధరణి‌లో వివరాలు మార్పులు చేర్పులు చేసే అధికారం స్థానికంగా ఎవరికి లేకపోవడంతో అసలైన రైతులు తీవ్రంగా ఆవేదన చెందవలసి వస్తుంది. అధికారులు స్థానికంగా పరిశీలన జరిపి అసలైన వారికి భూమి అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఆదివారం రోజు గన్‌పూర్ మండలం కొండాపూర్ గ్రామస్తులు తమ భూమిని వేరే వాళ్ళు పట్టా చేసుకున్నారని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News