పెట్రోల్ బంక్‌లోనే వాహనదారుడి ఆత్మహత్యాయత్నం
దిశ, మరిపెడ: పెట్రోల్ బంక్ మోసాలకు పాల్పడుతోందని ఆవేదన చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం ఏకంగా బంక్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. బంక్ సిబ్బంది, తోటి వాహనదారులు అడ్డుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల స్టేజి వద్ద ఉన్న పెట్రోల్ బంకులో సోమవారం జరగగా, గురువారం ఉదయం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. నర్సింహులపేట […]
దిశ, మరిపెడ: పెట్రోల్ బంక్ మోసాలకు పాల్పడుతోందని ఆవేదన చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం ఏకంగా బంక్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. బంక్ సిబ్బంది, తోటి వాహనదారులు అడ్డుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల స్టేజి వద్ద ఉన్న పెట్రోల్ బంకులో సోమవారం జరగగా, గురువారం ఉదయం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం గమనార్హం.
నర్సింహులపేట మండలంలోని లోక్య తండా జీపీ పరిధిలోని తిరుమ తండాకు చెందిన వీరన్న లీటర్ పెట్రోల్ కావాలని బాటిల్ తీసుకుని బంక్ వద్దకు చేరుకున్నాడు. అయితే తాను ఇచ్చిన మొత్తం కంటే పెట్రోల్ తక్కువగా వచ్చిందని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఎందుకు పెట్రోల్ తక్కువగా వచ్చిందో తెలపాలంటూ, బంకులో మోసం జరుగుతుందంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిబ్బంది అడ్డుకోవడంతో శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే రూ.100 మాత్రమే ఇవ్వడంతో, అంత మేరకే పెట్రోల్ బాటిల్‌లో పట్టి ఇవ్వడం జరిగిందని, తామేమీ తక్కువ కొట్టలేదని బంక్ సిబ్బంది స్పష్టం చేస్తుండటం గమనార్హం.