చిరుతో సుహాసిని?
మలయాళ మూవీ లూసిఫర్.. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్విరాజ్ దర్శకత్వం వహించారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు సాహో ఫేమ్ సుజిత్‌కు అప్పగించారు కూడా. ఇదిలా ఉంటే, లూసిఫర్‌లో ఒకప్పటి హీరోయిన్ సుహాసిని నటించనున్నట్లు సమాచారం. […]
మలయాళ మూవీ లూసిఫర్.. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్విరాజ్ దర్శకత్వం వహించారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు సాహో ఫేమ్ సుజిత్‌కు అప్పగించారు కూడా.
ఇదిలా ఉంటే, లూసిఫర్‌లో ఒకప్పటి హీరోయిన్ సుహాసిని నటించనున్నట్లు సమాచారం. మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రలో సుహాసిని మణిరత్నం కనిపించనుందట. కాగా చిరు, సుహాసిని కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రాగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కాగా ఈ చిత్రంలో జెనీలియా కూడా నటించనుందని సమాచారం.