హీరో మహేశ్ బాబు బాటలో నటుడు సుధీర్‌బాబు

దిశ, ఏపీ బ్యూరో: సినీనటుడు సుధీర్‌బాబు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి సుధీర్‌బాబు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అండగా నిలిచారు. చిన్నారి గుండె ఆపరేషన్ చేయడంతోపాటు ఆమె భవిష్యత్ కోసం పోస్టాఫీసులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వారిపాలిట దేవుడిగా మారాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె సంస్కృతి జాస్మిన్‌కు గుండె జబ్బు చేసింది. గుండెకు ఆపరేషన్ చేయాల్సి రావడంతో సుధీర్‌బాబును సంప్రదించారు. దీంతో […]

Update: 2021-07-11 01:45 GMT

దిశ, ఏపీ బ్యూరో: సినీనటుడు సుధీర్‌బాబు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి సుధీర్‌బాబు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అండగా నిలిచారు. చిన్నారి గుండె ఆపరేషన్ చేయడంతోపాటు ఆమె భవిష్యత్ కోసం పోస్టాఫీసులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి వారిపాలిట దేవుడిగా మారాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె సంస్కృతి జాస్మిన్‌కు గుండె జబ్బు చేసింది.

గుండెకు ఆపరేషన్ చేయాల్సి రావడంతో సుధీర్‌బాబును సంప్రదించారు. దీంతో స్పందించిన సుధీర్ బాబు పాప ఆపరేషన్ కోసం మే నెలలో రూ.1.70లక్షలు చెల్లించారు. తాజాగా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1.50 లక్షలను శ్రీకాకుళంలోని హెడ్‌పోస్టాఫీసులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా సుధీర్ బాబు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబుకు జాస్మిన్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అద్యక్షుడు మహ్మద్‌ షాజు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం వందలాది మందికి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News