ఏపీ హోం మంత్రి మాస్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు పల్లెల్లో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ప్రజా ప్రతినిధులంతా ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో హోం మంత్రి సుచరిత ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. మాస్కులను వినియోగించిన తరువాత జాగ్రత్తగా వాటిని నిర్మూలించాలని లేని పక్షంలో అవే రోగాలను మోసుకొచ్చే ప్రమాదం ఉందని […]

Update: 2020-03-20 07:23 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు పల్లెల్లో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ప్రజా ప్రతినిధులంతా ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో హోం మంత్రి సుచరిత ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. మాస్కులను వినియోగించిన తరువాత జాగ్రత్తగా వాటిని నిర్మూలించాలని లేని పక్షంలో అవే రోగాలను మోసుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. అనంతరం ఆమె మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: sucharita, guntur, ap, free mask supply, corona

Tags:    

Similar News