పది పాసైన మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
దిశ, సిద్దిపేట: మహిళా ఉద్యోగులు, టూరిస్టులు, విద్యార్థినుల కోసం హైదరాబాద్‌లో 24/7 షీ టాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ, రవాణా శాఖ సమన్వయంతో ఇప్పటివరకు 16 మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్లుగా అవకాశం కల్పించినట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లుగా ఉపాధి పొందేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు 30% సబ్సిడీ, 10% మార్జిన్ మనీతో బ్యాంక్ లోన్ మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు కమర్షియల్ వెహికల్ డ్రైవర్లుగా శిక్షణ […]
దిశ, సిద్దిపేట: మహిళా ఉద్యోగులు, టూరిస్టులు, విద్యార్థినుల కోసం హైదరాబాద్‌లో 24/7 షీ టాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ, రవాణా శాఖ సమన్వయంతో ఇప్పటివరకు 16 మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్లుగా అవకాశం కల్పించినట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లుగా ఉపాధి పొందేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు 30% సబ్సిడీ, 10% మార్జిన్ మనీతో బ్యాంక్ లోన్ మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు కమర్షియల్ వెహికల్ డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పదో తరగతి పాసై 18 ఏండ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు సిద్దిపేట కలెక్టరేట్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కానీ, సీడీపీఓ (సమగ్ర శిశు అభివృద్ధి పథక కార్యాలయం)లో కానీ ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.