ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన..
దిశ, కూకట్పల్లి: ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ నాయకులు శుక్రవారం జేఎన్టీయూహెచ్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్సిటిలోని వీసీ చాంబర్‌ను ముట్టడించడానికి యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో విద్యార్థి నాయకులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నాగరాజు, రోషన్, సునీల్, శశి, మున్నా, దయాకర్, అవినాష్, భరత్, […]
దిశ, కూకట్పల్లి: ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ నాయకులు శుక్రవారం జేఎన్టీయూహెచ్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్సిటిలోని వీసీ చాంబర్‌ను ముట్టడించడానికి యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో విద్యార్థి నాయకులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నాగరాజు, రోషన్, సునీల్, శశి, మున్నా, దయాకర్, అవినాష్, భరత్, గోపాల్, క్రాంతి, ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు.