వినూత్న నిరసన.. టీసీల కోసం ఉరి వేసుకున్న విద్యార్థులు

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హోలీ ఏంజల్స్ హై స్కూల్(ఏకాశిల విద్యా సంస్థ)లో 2019-2020 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉరి వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలో ప్రయివేట్ పాఠశాలలో మధ్య తరగతి కుటుంబాలను అధిక ఫీజులతో పీడిస్తున్నారని ఆరోపించారు. […]

Update: 2021-07-30 05:09 GMT

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హోలీ ఏంజల్స్ హై స్కూల్(ఏకాశిల విద్యా సంస్థ)లో 2019-2020 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉరి వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలో ప్రయివేట్ పాఠశాలలో మధ్య తరగతి కుటుంబాలను అధిక ఫీజులతో పీడిస్తున్నారని ఆరోపించారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. జీవో నెం.46 నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధిత విద్యార్థులకు టీసీలు అందజేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News