మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి అదృశ్యం

దిశ, జవహర్ నగర్: మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఇంట్లో నుంచి ఓ విద్యార్థి వెళ్లిపోయిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్టేషన్ అధికారి బిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన చిలకలపూడి శ్రీనివాస్‌రావ్ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ, చెర్లపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన పెద్ద కుమారుడు చిలకలపూడి రామదాసు (17) ఈసీఐఎల్‌లోని చైతన్య కళాశాలలో ఇంటర్ […]

Update: 2021-08-30 08:17 GMT

దిశ, జవహర్ నగర్: మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఇంట్లో నుంచి ఓ విద్యార్థి వెళ్లిపోయిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్టేషన్ అధికారి బిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన చిలకలపూడి శ్రీనివాస్‌రావ్ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ, చెర్లపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

తన పెద్ద కుమారుడు చిలకలపూడి రామదాసు (17) ఈసీఐఎల్‌లోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో కాలేజీలో వారం వారం నిర్వహించే పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చేవి. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియటంతో ఈ నెల 29న ఉదయం రామదాసు ఇంట్లో నుంచి వెళ్లి ఇప్పటికీ తిరిగిరాలేదు. దీంతో తండ్రి శ్రీనివాస్‌రావ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News