స్టువర్ట్ బ్రాడ్‌ను సన్మానించిన ఈసీబీ

దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 7వ బౌలర్‌గా రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ (Stuart Broad)ను ఈసీబీ (england and wales cricket board) శుక్రవారం సన్మానించింది. ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజ్ బౌల్ మైదానంలో బ్రాడ్‌ను వెండి స్టంప్, బెయిల్‌తో సత్కరించారు. ఈ వెండి స్టంప్‌ (Silver stump)ను బ్రాడ్‌కు ఈసీబీ […]

Update: 2020-08-21 08:15 GMT

దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 7వ బౌలర్‌గా రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ (Stuart Broad)ను ఈసీబీ (england and wales cricket board) శుక్రవారం సన్మానించింది. ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజ్ బౌల్ మైదానంలో బ్రాడ్‌ను వెండి స్టంప్, బెయిల్‌తో సత్కరించారు.

ఈ వెండి స్టంప్‌ (Silver stump)ను బ్రాడ్‌కు ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ అందించారు. పాకిస్తాన్ సిరీస్‌లో కూడా రాణించిన బ్రాడ్ ప్రస్తుతం 511 వికెట్ల వద్ద ఉన్నాడు. బ్రాడ్ కంటే ముందు 519 వికెట్లతో వెస్టిండీస్ దిగ్గజం కొర్ట్నీ వాల్ష్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ రాణిస్తే ఆ రికార్డు కూడా బద్దలవడం ఖాయం. ఇక ఈసీబీ చైర్మన్‌గా త్వరలో పదవీ విరమణ చేయనున్న గ్రీవ్స్‌కు ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ సంతకాలు చేసిన టీం జెర్సీని కెప్టెన్ జో రూట్ అందించాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఆఖరి మ్యాచ్ డ్రా చేసినా సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది.

Tags:    

Similar News