IPL-2025: కాసేపట్లో SRH vs Rajasthan మ్యాచ్.. జట్లు ఇవే!

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Rajiv Gandhi International Stadium) వేదికగా కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.

Update: 2025-03-23 06:20 GMT
IPL-2025: కాసేపట్లో SRH vs Rajasthan మ్యాచ్.. జట్లు ఇవే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Rajiv Gandhi International Stadium) వేదికగా కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ(HCA) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌తో ఉన్న సన్‌రైజర్స్‌ శుభారంభం చేయాలని హైదరాబాద్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్ జట్టుకు కమిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్(Riyan Parag) నాయకత్వం వహించబోతున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(SRH): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు(RR): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

Tags:    

Similar News