ఐపీఎల్ 2025: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భువనేశ్వర్ కుమార్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన మెగా వేలంలో కీలక ప్లేయర్లను పాత జట్లు వదులుకున్నాయి.

Update: 2025-03-23 08:32 GMT
ఐపీఎల్ 2025: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భువనేశ్వర్ కుమార్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) ప్రారంభానికి ముందు గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన మెగా వేలం (Mega Auction) లో కీలక ప్లేయర్లను పాత జట్లు వదులుకున్నాయి. ఇందులో గత 8 సిజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టును అంటిపెట్టుకున్న భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) లాంటీ కీలక ప్లేయర్ ను హైదరాబాద్ రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలిపెట్టింది. దీంతో జట్టు యాజమాన్యం పై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తాయి. కనీసం వేలంలో ఆయిన భువనేశ్వర్ తిరిగి కొంటారని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ చివరకు భూవిని ఆర్సీబీ (RCB) జట్టు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆర్సీబీ జట్టులో అయిన భువనేశ్వర్ (Bhubaneswar) ను చూడవచ్చు అని అభిమానులు నిన్నటి మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. శనివారం రాత్రి కోల్‌కత్తా వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భువనేశ్వర్ కుమార్‌కు తుది జట్టులో అవకాశం కలిగుగుతందని అంతా భావించారు.

కానీ చివరి నిమిషంలో భువి అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ప్లేయింగ్ 11 తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో భూవికి అవకాశం దక్కలేదు. ఈ నిరాశతో ఉన్న అభిమానులకు.. మ్యాచ్ మధ్యలో ప్లేయర్స్ గ్యాలరీ లో ఉన్న భూవి దీనంగా కూర్చొని ఉండటం కనిపించడంతో క్రికెట్ అభిమానులు ఆవేదనకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వి మిస్ యూ భువనేశ్వర్ కుమార్ (We miss you Bhuvneshwar Kumar) అంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పోస్టులు పెడుతున్న వారిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అధికంగా ఉండటం విశేషం. ఏది ఏమైనప్పటికి భారత క్రికెట్ లో అన్ని ఫార్మట్లలో ఓ వెలుగు వెలిగిన భువనేశ్వర్.. ఈ ఐపీఎల్ సీజన్ లో తన ఫామ్ లోకి తిరిగి వచ్చి.. భారత జట్టులో స్థానం దక్కించుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.


Similar News