IPL 2025 : SRH vs RR ఐపీఎల్ మ్యాచ్... బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్న నలుగురు అరెస్ట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium)లో జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-23 09:56 GMT
IPL 2025 : SRH vs RR ఐపీఎల్ మ్యాచ్... బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్న నలుగురు అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium)లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అదనుగా భావించి స్టేడియం వద్ద టికెట్లను బ్లాక్‌(Block Tickets)లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(SOT) అరెస్ట్ చేసింది. ఈ ఘటనలో నిందితుల వద్ద నుండి 15 టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐపీఎల్ టికెట్ల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిందితులు వాటిని అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తూ పట్టుబడ్డారు. కాగా మార్చి 22న భరద్వాజ్ అనే వ్యక్తిని కూడా ఇదే తరహాలో టికెట్లను కొనుగోలు చేసి అమ్ముతూ ఉండగా అరెస్ట్ చేశారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాపై దృష్టి సారించిన పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు SRH vs RR మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ కి దిగింది. 

Tags:    

Similar News