వలిగొండలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు
దిశ, వెబ్‌డెస్క్ : వలిగొండ మండలంలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు వివిధ కారణాలు చెబుతూ బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ పకడ్భందీగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ […]
దిశ, వెబ్‌డెస్క్ : వలిగొండ మండలంలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు వివిధ కారణాలు చెబుతూ బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ పకడ్భందీగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి కాలనీలో పగలు, రాత్రి గస్తీ నిర్వహిస్తూ కారణం లేకుండా బయటికి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పోలీసులకు సహకరించాలని, ఖచ్ఛితంగా మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలని సూచించారు. కారణం లేకుండా బయటికి వస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.