ఆ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆ రెండు సెంచరీలు మళయాలీలే చేయడం గమనార్హం. ఒకటి కేరళకు చెందిన సంజూ శాంసన్ చేయగా.. మరొకటి కేరళలో పుట్టి కర్ణాటకలో పెరిగిన దేవ్‌దత్ పడిక్కల్ బ్యాట్ నుంచి వచ్చింది. సంజూ శాంసన్‌కు దేశవాళీ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్నది. కానీ దేవ్‌దత్ పడిక్కల్ వంటి అన్ క్యాప్డ్ ప్లేయర్ చేసిన సెంచరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆ రెండు సెంచరీలు మళయాలీలే చేయడం గమనార్హం. ఒకటి కేరళకు చెందిన సంజూ శాంసన్ చేయగా.. మరొకటి కేరళలో పుట్టి కర్ణాటకలో పెరిగిన దేవ్‌దత్ పడిక్కల్ బ్యాట్ నుంచి వచ్చింది. సంజూ శాంసన్‌కు దేశవాళీ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్నది. కానీ దేవ్‌దత్ పడిక్కల్ వంటి అన్ క్యాప్డ్ ప్లేయర్ చేసిన సెంచరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో చేసిన సెంచరీ క్రికెట్ విమర్శకులను సైతం ఆకట్టుకున్నది. అయితే పడిక్కల్ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు దాగున్నాయి. అంతకు మించి ఆట మెరుపు పరుచుకోవడానికి అతడు చేసిన కృషి కూడా ఉన్నది. కేవలం కొడుకు ఆట మెరుపు పడుతుందని భావించే పడిక్కల్ తల్లిదండ్రులు కేరళ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. అయితే పడిక్కల్‌ను చూసిన బెంగళూరు కోచ్‌లు అతడు బౌలర్ అని భ్రమపడ్డారు. కానీ అక్కడే దేవ్‌దత్ కెరీర్ మలుపు తిరిగింది.
పొడుగైన బ్యాట్స్‌మాన్..
బెంగళూరులోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌కు 11 ఏళ్ల వయసులో వెళ్లిన పడిక్కల్‌ను చూసి అక్కడి కోచ్‌లు బౌలర్ అని భ్రమపడ్డారంటా. ఆ వయసులోనే మిగిలిన పిల్లల కంటే చాలా ఎత్తు ఉండేవాడు. దీంతో అతడిని బౌలింగ్ చేయమని కోరారు. అయితే తాను బ్యాట్స్‌మాన్ అని.. తనకు బౌలింగ్ అంతగా రాదని పడిక్కల్ చెప్పాడు. అయినా సరే అక్కడి కోచ్‌లు నీ హైట్‌కి బౌలింగ్ అయితేనే సరిపోతుంది.. మంచి ఫాస్ట్ బౌలర్‌గా మారొచ్చని ఒత్తిడి తెచ్చారట. కానీ మహ్మద్ నసీరుద్దీన్ అనే కోచ్ మాత్రం పడిక్కల్‌లోని బ్యాటింగ్ టాలెంట్ చూసి మంచి బ్యాట్స్‌మాన్ అవుతాడని మిగతా వారిని ఒప్పించాడు. పడిక్కల్ బ్యాటింగ్ ప్రతిభను నెట్స్‌లో ఇర్ఫాన్ సైత్ అనే కోచ్‌కు నసీరుద్దీన్ చూపించడంతో అతడి జీవితం మలుపు తిరిగింది. ఆనాటి నుంచి బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. పడిక్కల్‌కు శిక్షణ ఇచ్చిన సైత్ మాట్లాడుతూ..’ఆట గురించి చాలా సీరియస్‌గా ఉండేవాడు. బంతిని ఎలా కొట్టాలో బడాగా తెలిసిన క్రికెటర్. పడిక్కల్ దగ్గర క్రికెట్ తప్ప మరేమీ ఉండదు. తన తోటి స్నేహితులు సినిమాలు, శికార్లు అంటూ తిరిగినా.. పడిక్కల్ మాత్రం బ్యాటింగ్ మెరుగు పరుచుకోవడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టేవాడు. అతడిలో సహజ సిద్దంగానే బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నది. ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడు’ అని చెప్పాడు. తన తల్లిదండ్రలు ఎందుకు కేరళ వదలి వచ్చారో పడిక్కల్‌కు బాగా తెలుసు. అందుకే క్రికెట్ తప్ప ఇతర విషయాలను అస్సలు పట్టించుకోలేదు.
కోహ్లీ సలహాలతో..
కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రతిభ కనపర్చడంతో గత సీజన్ ముందు పడిక్కల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పుడే ఆర్సీబీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువ క్రికెటర్లకు సీనియర్లను జతచేసి వారిని గ్రూమ్ చేయడం ప్రారంభించింది. అప్పుడు పడిక్కల్‌ను గ్రూమ్ చేసే బాధ్యత కోహ్లీ మీద పడింది. భారత జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం కోహ్లీ పర్యవేక్షణలో పడిక్కల్ మరింత రాటు తేలాడు. ఏ సమయంలో ఎలా ఆడాలో పూర్తిగా తెలుసుకున్నాడు. తనకు మెలకువలు నేర్పించిన కోహ్లీ తోడుగా ఉన్న సమయంలోనే రాజస్థాన్‌పై సెంచరీ నమోదు చేశాడు. ఈ విషయంపై పడిక్కల్ మాట్లాడుతూ..’నా చిన్నప్పటి నుంచి కోహ్లీని చూసి పెరిగాను. అతడిలా పరుగులు సాధించాలని భావించేవాడిని. కానీ ఏకంగా ఆయనతో కలసి ఆడే అవకాశం లభించింది. బ్యాటింగ్‌లో ఎన్నో మెలకువలు తనకు నేర్పించాడు’ అని పడిక్కల్ చెప్పాడు. రాబోయే కాలంలో భారత జట్టులో పడిక్కల్ ఒక స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతాడని మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.