ఆ వేధింపులు ఆపండి : ఎంపీ రఘురామ

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. నవ సూచనలు పేరుతో బుధవారం తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ ఆ చ‌ట్టాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. వాస్తవానికి ఈ చ‌ట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. […]

Update: 2021-07-07 04:39 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. నవ సూచనలు పేరుతో బుధవారం తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ ఆ చ‌ట్టాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

వాస్తవానికి ఈ చ‌ట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మరోవైపు ఎవరైనా త‌న‌ ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఆ వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాల‌ని ఎంపీ రఘురామ లేఖలో డిమాండ్ చేశారు.

Tags:    

Similar News