రాష్ట్రాలు ఆక్సిజన్ డిమాండ్‌ను అదుపులో ఉంచుకోవాలి : పీయూష్ గోయల్
న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు అందించే ప్రాణ వాయువు (ఆక్సిజన్) కొరత దేశవ్యాప్తంగా వేధిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ డిమాండ్‌ను అదుపులో ఉంచుకోవడం రాష్ట్రాల బాధ్యత అని సూచించారు. ఆదివారం రాత్రి ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గోయల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్‌ను అదుపులో ఉంచుకోవాలి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దానిని విధిగా నిర్వర్తించాలి..’ […]
న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు అందించే ప్రాణ వాయువు (ఆక్సిజన్) కొరత దేశవ్యాప్తంగా వేధిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ డిమాండ్‌ను అదుపులో ఉంచుకోవడం రాష్ట్రాల బాధ్యత అని సూచించారు. ఆదివారం రాత్రి ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గోయల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్‌ను అదుపులో ఉంచుకోవాలి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దానిని విధిగా నిర్వర్తించాలి..’ అని వ్యాఖ్యానించారు. దేశంలో పలు చోట్ల కరోనా పేషెంట్లకు అవసరమైనదానికంటే ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆక్సిజన్ డిమాండ్-సైడ్ మేనేజ్‌మెంట్ సప్లై-సైడ్ మేనేజ్‌మెంట్ వలే ముఖ్యమైనదని తెలిపారు. కరోనా కేసుల ట్రెండ్ ఇలాగే కొనసాగితే అది కచ్చితంగా దేశ వైద్య వ్యవస్థ మీద తీరని భారమేనని అన్నారు. తాము రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నామనీ, కానీ ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటివాటి కొరత రాకుండా చూసుకుని మేనేజ్ చేసుకునే బాధ్యత వాటిపైనే ఉందని స్పష్టం చేశారు. కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిత్యం (రౌండ్ ది క్లాక్) అప్రమత్తంగా ఉన్నదని, ప్రధాని మోడీ అయితే రోజుకు 18 నుంచి 19 గంటలు దీనికోసమే పనిచేస్తున్నారని గోయల్ అన్నారు. కొవిడ్-19 మీద రాజకీయాలు ఏమాత్రం తగవని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి అవసరమైన దానికంటే అదనపు సాయం అందిస్తున్నామని గోయల్ తెలిపారు.