కరీంనగర్ కలెక్టర్, సీపీకి HRC నోటిసులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో జరిగిన భూ అక్రమాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ప్రముఖ మీడియాలో వచ్చిన వరుస కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్చార్సీ బొమ్మకల్ భూ అక్రమాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇదే స్కామ్‌లో అరెస్టైన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌పై ఎలాంటి కేసులు పెట్టారో తెలపాలని కూడా ఆదేశించింది. నీటి వనరుల […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో జరిగిన భూ అక్రమాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ప్రముఖ మీడియాలో వచ్చిన వరుస కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్చార్సీ బొమ్మకల్ భూ అక్రమాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఇదే స్కామ్‌లో అరెస్టైన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌పై ఎలాంటి కేసులు పెట్టారో తెలపాలని కూడా ఆదేశించింది. నీటి వనరుల దోపిడీ, ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన వివరాలు, ప్రధానంగా నీటి వనరుల ఎఫ్టీఎల్ వివరాలు పంపించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చార్సీ ఆదేశించింది. అంతేకాకుండా, జిల్లాలోని ప్రభుత్వ భూముల డిటైల్స్ కూడా పంపించాలని కోరింది.