జోరందుకున్న చికెన్ విక్రయాలు
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌కు మాంసాహారానికి సంబంధం లేదు, అయినా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందరూ మాంసాహారం తినాలని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆదివారం మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కరోనా దెబ్బకు చికెన్ ధరలు పాతాళానికి పడిపోవడం మాట పక్కకు పెడితే చివరకు ఉచితంగా ఇచ్చినా తీసుకునేవారు లేకపోవడంతో చాలాచోట్ల కోళ్లను గుంతలు తీసి పూడ్చేశారు. ఈ క్రమంలో సీఎం ప్రకటనతో చికెన్ ధరలు నింగినంటాయి. […]
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌కు మాంసాహారానికి సంబంధం లేదు, అయినా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందరూ మాంసాహారం తినాలని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆదివారం మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కరోనా దెబ్బకు చికెన్ ధరలు పాతాళానికి పడిపోవడం మాట పక్కకు పెడితే చివరకు ఉచితంగా ఇచ్చినా తీసుకునేవారు లేకపోవడంతో చాలాచోట్ల కోళ్లను గుంతలు తీసి పూడ్చేశారు. ఈ క్రమంలో సీఎం ప్రకటనతో చికెన్ ధరలు నింగినంటాయి. ఆదివారం కిలో చికెన్ రూ.180కు చేరుకుంది. అలాగే గుడ్ల ధరలు కూడా బాగా పెరిగాయి. ప్రస్తుతం గతంలో మాదిరిగా విక్రయాలు జరుగుతుండడంతో వ్యాపారస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం జిల్లాలోని మాంసం మార్కెట్లు అన్ని కిటకిటలాడాయి.
Tags : start, Chicken, sales, mahabubnagar, coronavirus