షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు.. స్కూళ్లకు సెలవులు!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటివరకు జరిగే తరగతులను రద్దు చేసి అన్ని జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో శానిటైజేషన్ చేయిస్తున్నామన్నారు.రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తారని వస్తున్న కథనాలపై మంత్రి […]

Update: 2021-04-19 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటివరకు జరిగే తరగతులను రద్దు చేసి అన్ని జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో శానిటైజేషన్ చేయిస్తున్నామన్నారు.రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తారని వస్తున్న కథనాలపై మంత్రి స్పందించారు. పరీక్షల రద్దు ఉండదని షెడ్యూల్ ప్రకారమే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ వెల్లడించారు.

Tags:    

Similar News