సన్‌రైజర్స్.. నాన్ 'హైదరాబాద్'
దిశ, స్పోర్ట్స్: ‘సన్‌రైజర్స్ జట్టులోకి లోకల్ ప్లేయర్స్‌ని తీసుకోకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం’.. ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. గతంలో ఏనాడూ ఏ రాజకీయ పార్టీగానీ, ఇతర వ్యవస్థలు కానీ ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభిస్తుండటం విశేషం. దీనికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరే. ఐపీఎల్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ […]
దిశ, స్పోర్ట్స్: ‘సన్‌రైజర్స్ జట్టులోకి లోకల్ ప్లేయర్స్‌ని తీసుకోకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం’.. ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. గతంలో ఏనాడూ ఏ రాజకీయ పార్టీగానీ, ఇతర వ్యవస్థలు కానీ ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభిస్తుండటం విశేషం. దీనికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరే. ఐపీఎల్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఒకవైపు అంతర్జాతీయ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూనే లోకల్ టాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, సన్‌రైజర్స్ యాజమాన్యం మాత్రం తెలుగు ఆటగాళ్లను జట్టులో తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. జట్టులోకి ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తీసుకోవద్దు అనేది పూర్తిగా ఫ్రాంచైజీ ఇష్టమే. కానీ ఇతర ఫ్రాంచైజీలు లోకల్ క్రీడాకారులకు ఇచ్చిన ప్రాధాన్యత సన్‌రైజర్స్ ఇవ్వడం లేదన్నది నూటికి నూరుపాళ్లు నిజం. స్థానిక క్రికెటర్లు లేకపోవడం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టుకు సపోర్ట్ చేసే వాళ్లు ఎక్కువవుతున్నారనే అపవాదు కూడా ఉన్నది.
ఉన్న ఇద్దరినీ వదిలేసింది..
సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే ముందు డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు ఉండేవాళ్లు. దాని స్థానంలో సన్‌రైజర్స్ వచ్చిన తర్వాత వేణుగోపాల్‌రావు, అక్షత్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ వంటి లోకల్ ప్లేయర్లకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ క్రమంగా తెలుగు ఆటగాళ్లను వదిలేసి ఆసీస్, ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు ఎక్కువగా జట్టులో చోటు కల్పించింది. సరిగా చూస్తే జట్టులో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ఐపీఎల్‌లో ఎక్కవ ఫ్రాంచైజీలు భారత క్రికెటర్లకే కెప్టెన్సీ కట్టిపెట్టింది. కానీ సన్‌రైజర్స్‌కు మొదటి నుంచి విదేశీయులే కెప్టెన్లుగా వ్యవహరించారు. మధ్యలో డేవిడ్ వార్నర్ నిషేధం ఎదుర్కున్నప్పుడు మాత్రం భువనేశ్వర్‌ను కెప్టెన్‌గా నియమించింది. గత ఏడాది జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లు ఉన్నా ఏనాడూ తుది జట్టులోకి వాళ్లను తీసుకోలేదు. భవనాక సందీప్, యర్రా పృథ్విరాజ్ సన్‌రైజర్స్ స్క్వాడ్‌లో ఉన్నా.. తుది జట్టులో మాత్రం వాళ్లిద్దరికి ఏనాడూ ఛాన్స్ రాలేదు. ఇక ఈ ఏడాది వారిద్దరిని కూడా విడుదల చేసిన సన్‌రైజర్స్.. రూ. 3.70 కోట్లు వెచ్చించి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరిలో ఒక్కరు కూడా తెలుగు ఆటగాళ్లు లేరు. రూ. 2 కోట్లతో ఫామ్‌లో లేని కేదార్ జాదవ్‌ని, రూ. 1.50 కోట్లతో ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ముజీబుర్ రెహ్మాన్‌ను, రూ. 20 లక్షలు పెట్టి జగదీష్ సుశిత్‌ను తీసుకుంది. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు ఉన్నారు. గత సీజన్‌లో నబీ పూర్తిగా డగౌట్‌కే పరిమితం అయ్యారు. అయినా ముజీబుర్ రెహ్మాన్‌ను ఎందుకు తీసుకున్నారో క్రికెట్ విశ్లేషకులకు కూడా అర్దం కావడం లేదు.
ఇతర ఫ్రాంచైజీలు నయం..
ఐపీఎల్‌లో ఇతర ఫ్రాంచైజీలు స్థానిక క్రికెటర్లకు ప్రాధాన్యత ఇచ్చి.. వారికి తుది జట్టులో అవకాశాలు ఇవ్వడంతో ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీకి చెందిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైకి చెందిన జగదీషన్, సాయికిషోర్‌లను సీఎస్కే, పంజాబ్‌కు చెందిన ప్రభసిమ్రన్ సింగ్, మన్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌లను పంజాబ్ కింగ్స్ జట్టు ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. వీరిలో రిషబ్ పంత్ ఏకంగా టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో చోటు సంపాదించాడు. ఇక గతంలో ముంబయి ఇండియన్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రా ఇప్పుడు జాతీయ జట్టులో కీలక సభ్యుడు. స్థానికులు కాకపోయినా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్, సీఎస్కే, ముంబయి, బెంగళూరు జట్లు రంజీ ప్లేయర్లను తీసుకొని వారికి తగిన శిక్షణ ఇస్తున్నాయి. రాహుల్ తెవాతియా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి క్రికెటర్లు ఇలా వెలుగులోకి వచ్చిన వాళ్లే. ఇన్నాళ్లలో సన్ రైజర్స్ తరపున వెలుగులోకి వచ్చిన క్రికెటర్ నటరాజన్ మాత్రమే. స్థానికుడైన మహ్మద్ సిరాజ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మారిన తర్వాతే పలు అవకాశాలు సాధించాడు. వేలంలో నలుగురు తెలుగు ఆటగాళ్లు ఉన్నా.. వారిలో ఒక్కరిని కూడా సన్‌రైజర్స్ తీసుకోలేదు. ఎం. హరిశంకర్ రెడ్డి, కె. భగత్ వర్మను సీఎస్కే, కేఎస్ భరత్‌ను ఆర్సీబీ, యుధివీర్ చరాక్‌ను ముంబయి తీసుకున్నాయి. ఇప్పటికైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. విదేశీ స్టార్ ప్లేయర్లతో పాటు స్థానికులకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.