అరెస్టు చేసి టెర్రరిస్టుతో కలిపి ఉంచారు: శ్రీశాంత్

దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ కొన్నాళ్లు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నిషేధాన్ని పూర్తి చేసుకుని క్రికెట్‌లో పునరాగమనం చేయాలని భావిస్తున్న శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీ పోలీసులు తనను అరెస్టు చేసిన తర్వాత 12 రోజులు టెర్రరిస్టుల వార్డులో ఉంచారని, అప్పుడు నరకం అనుభవించానని చెప్పాడు. ‘నా జీవితంలో ఇది రెండో జన్మ అని నేను భావిస్తాను. ఒక రోజు […]

Update: 2020-07-02 08:00 GMT

దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ కొన్నాళ్లు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నిషేధాన్ని పూర్తి చేసుకుని క్రికెట్‌లో పునరాగమనం చేయాలని భావిస్తున్న శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీ పోలీసులు తనను అరెస్టు చేసిన తర్వాత 12 రోజులు టెర్రరిస్టుల వార్డులో ఉంచారని, అప్పుడు నరకం అనుభవించానని చెప్పాడు. ‘నా జీవితంలో ఇది రెండో జన్మ అని నేను భావిస్తాను. ఒక రోజు మ్యాచ్ అనంతరం పార్టీ చేసుకున్న తర్వాత పోలీసులు నన్ను అరెస్టు చేశారు. తీసుకెళ్లి టెర్రరిస్టులు ఉండే వార్డులో ఉంచారు. ఎవరో కావాలని ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఆ సమయంలో నేను నరకం అనుభవించాను. నా కుటుంబం, ఇల్లు గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే వాడిని. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య నన్ను చూడటానికి వచ్చాడు. అప్పుడు నాకు ప్రాణం లేచివచ్చినట్లయింది. కుటుంబంలో అందరూ బాగున్నారు అని అన్నయ్య చెప్పాక నా మనసు కుదుటపడింది. క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం నాకు అండగా నిలిచింది’ అని శ్రీశాంత్ చెప్పాడు. తాను జైలుకు వెళ్లే, వచ్చే సమయాల్లో ఎవరూ ఫొటోలు తీయలేదు. అదే నాకు చాలా సంతోషం.

Tags:    

Similar News