ఏడేళ్ల తర్వాత మైదానంలోకి శ్రీశాంత్

దిశ, స్పోర్ట్స్: కేరళ స్పీడ్‌స్టర్, టీం ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం గడువు ముగియనుంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. అయితే అతడు పలుమార్లు బీసీసీఐకి తన నిషేధాన్ని ఎత్తివేయమని కోరాడు. దీంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్, రిటైర్డ్ జస్టీస్ డీకే జైన్ ఆ నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. జైన్ తీసుకున్న నిర్ణయంతో శ్రీశాంత్‌పై నిషేధం సెప్టెంబర్ 13న ముగియనుంది. సుప్రీంకోర్టు కూడా శ్రీశాంత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో త్వరలోనే […]

Update: 2020-09-06 10:20 GMT

దిశ, స్పోర్ట్స్: కేరళ స్పీడ్‌స్టర్, టీం ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం గడువు ముగియనుంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. అయితే అతడు పలుమార్లు బీసీసీఐకి తన నిషేధాన్ని ఎత్తివేయమని కోరాడు. దీంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్, రిటైర్డ్ జస్టీస్ డీకే జైన్ ఆ నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. జైన్ తీసుకున్న నిర్ణయంతో శ్రీశాంత్‌పై నిషేధం సెప్టెంబర్ 13న ముగియనుంది.

సుప్రీంకోర్టు కూడా శ్రీశాంత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో త్వరలోనే అతను క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రాబోయే రంజీ సీజన్‌లో శ్రీశాంత్‌ను కేరళ జట్టు తరపున ఆడించడానికి కేసీఏ సుముఖంగా ఉంది. తనపై విధించిన నిషేధం ముగిసిపోతుండటంతో శ్రీశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడు. మరోసారి టీమ్ ఇండియా తరపున ఆడాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టాడు. త్వరలోనే కొచ్చిలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. కష్టకాలంతో తనకు అండగా నిలిచిన అందరికీ శ్రీశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.

Tags:    

Similar News