Zim Vs Afg : జింబాబ్వే జట్టుకు మ్యాచ్ ఫీజులో కోత.. కారణమిదే..!

జింబాబ్వే జట్టుకు మ్యాచ్ ఫీజులో కోత పడింది.

Update: 2024-12-16 13:03 GMT

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే జట్టుకు మ్యాచ్ ఫీజులో కోత పడింది. అఫ్గానిస్తాన్‌తో హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఇక్నో చాబీ, ఫోర్స్‌టర్ ముతిజ్వా, థర్డ్ అంపైర్ పెర్కివల్ సిజారా, ఫోర్త్ అంపైర్ లాంగ్‌స్టన్ రుసెరె అభియోగాలు మోపారు. జింబాబ్వే జట్టు కెప్టెన్ సికింధర్ రజా జరిమానాకు ఒప్పుకున్నట్లు ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రెఫ్రీ ఆండీ పిక్రాఫ్ట్ తెలిపాడు. ఐసీసీ ప్రవర్తనా నియామావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. అఫ్గానిస్తాన్ మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో గెలుచుకుంది. 

Tags:    

Similar News