PKL 2024 : ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ

ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ కే.సీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-12-16 18:46 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ కే.సీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. హర్యానా స్టీలర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రెండో జట్టు ఢిల్లీ. సోమవారం పుణెలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై 25-47 తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఆషు మాలిక్ 17 పాయింట్లతో చెలరేగి ఢిల్లీ విజయాన్ని ఏకపక్షం చేశాడు. యోగేశ్ కూడా 9 పాయింట్లతో సత్తాచాటాడు. మరోవైపు, పాట్నా పైరేట్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ఆసక్తికరంగా సాగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌ను 37-32 తేడాతో ఓడించింది. తాజా ఓటమితో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో ఉన్న పుణేరి పల్టాన్ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

Tags:    

Similar News